తెలంగాణ శాసనసభలో విపక్షాల నోరు నొక్కే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. సభలో హుందాగా వ్యవహరించాల్సిన మంత్రులే... సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అరుణ మండిపడ్డారు.