నానాటికీ పెరుగుతున్న బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ దిశగా దిగుమతులపై సుంకాలను పెంచాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు మరో రెండు రోజుల్లో వెలువడవచ్చని సమాచారం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ అక్టోబర్ లో బంగారం దిగుమతి నాలుగు రెట్లు పెరగడంతో, కేంద్రం సుంకాలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా బంగారం ట్రేడింగ్ జరిపే సంస్థలపై నిబంధనలు కఠినం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వుంది.