ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత సాధికార సంస్థ) బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకురావాలా? లేక బిల్లును ప్రవేశ పెట్టాలా? అనే విషయంతో తుది నిర్ణయానికి రావాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాజధాని ప్రాంత సాధికార సంస్థకు ఛైర్మన్ గా చంద్రబాబు వ్యవహరించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మారుస్తూ తీర్మానించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచారు. ఎన్టీఆర్ వైద్యసేవలో వ్యాధుల సంఖ్యను 938 నుంచి 1,038కి పెంచారు.
మంగంపేట బైరైటిస్ గనుల్లో 2004 నుంచి అనేక అక్రమాలు జరిగాయని... దీనికి సంబంధించిన నివేదికలు కూడా వచ్చాయని... దీంతో, ఈ అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాకుండా, 2004 తర్వాత బైరైటిస్ గనుల తవ్వకాలకు జారీ చేసిన జీవోను కేబినెట్ రద్దు చేసింది. ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక రంగం మిషన్ తీరుతెన్నులను ఈ సమావేశంలో సమీక్షించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి