కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు భూములను ధారాదత్తం చేసిన హర్యానా అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు వాద్రా భూ వ్యవహారాన్ని తిరగదోడతామని చెప్పడమే కాక, సదరు భూముల బదలాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాడు వాద్రాకు పూర్తిగా సహకరించిన అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ దల్బీర్ సింగ్ ను హర్యానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
గుర్గావ్ జిల్లాలోని రోజ్కా గుర్జార్ గ్రామంలో నమోదైన అక్రమ భూ బదలాయింపుకు సంబంధించి సింగ్ ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు సర్కారు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హర్యానా మాజీ మంత్రి బంధువైన దల్బీర్ సింగ్ దశాబ్ద కాలంగా గుర్గావ్-ఫరీదాబాద్ లో ఎలాంటి బదిలీ లేకుండానే ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకే సింగ్ పై చర్య తీసుకున్నట్లు హర్యానా ఆర్థిక శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు చెప్పారు. ఇదిలా ఉంటే, మరో భూ వివాదంలో మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ నెల 11న దల్బీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి