బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా 'బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్'ను త్వరలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంకుకు అధిపతిగా నియమించే వ్యక్తుల జాబితాలో ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పేరు కూడా ఉందంటున్నారు. ఈ పదవికి ఆయనతో పాటు ఓ కేంద్ర మంత్రి, మౌలిక సదుపాయాల ఆర్థిక రంగంలో అనుభవజ్ఞుడైన బ్యాంకర్ ల పేర్లను పరిశీలిస్తున్నారట. వారిలో సరైన వ్యక్తిని త్వరలో ఎంచుకోనున్నారని, ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో మాత్రమే ఉందని వినికిడి. అయితే, ఇంకా పలువురి పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. అటు, ఈ విషయమై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాజన్ ను సంప్రదించలేదంటున్నారు.
రెండు రోజుల కిందట (శనివారం) బ్రిస్బేన్ లో జరిగిన బ్రిక్స్ నేతల సమావేశంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ బ్యాంకును 2016 కల్లా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. త్వరలోనే బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. బ్యాంక్ తొలి అధ్యక్షుడిని భారత్ నియమించేందుకు ఇటీవల ఫోర్టలేజాలో జరిగిన ఆరవ సదస్సులో బ్రిక్స్ దేశాలు అంగీకరించాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి