శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గార్ల మండలం మొగదలపాడులో సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు యువకుల మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. గల్లంతైన మరో యువకుడి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.