శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక ఆస్ట్రేలియా పర్యటనకు రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరనుంది. రాంచీలో జరిగిన ఐదో వన్డేలో ఓటమి అంచులకు చేరిన టీమిండియాను కెప్టెన్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ తో విజయతీరాలకు చేర్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 286 పరుగులు సాధించింది. లంక కెప్టెన్ మాథ్యూస్ వీరోచిత సెంచరీతో 139 పరుగులతో చివరి దాకా క్రీజులో నిలిచాడు. ఇక ఆ తర్వాత 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, మొదట తడబడినా, కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ పుణ్యమాని ఒడ్డుకు చేరింది. 14 పరుగులకే రెహానే, రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఆదుకున్నాడు.
చివరి దశలోనూ వరుసగా వికెట్లు పడుతున్నా, సడలని ధైర్యంతో లంక బౌలర్లను ఎదుర్కున్న కోహ్లీ, భారత్ కు వరుసగా ఐదో విజయాన్ని అందించాడు. అటు బ్యాటింగ్ లో చెలరేగి, బంతితోనూ మ్యాజిక్ చేసిన లంక కెప్టెన్ మాథ్యూస్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవగా, సిరీస్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన కనబరచిన కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి