దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17,18 తేదీల్లో కాంగ్రెస్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెహ్రూపై మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి పేర్కొన్న కొటేషన్ ను ఆ రోజు ప్రారంభించనున్న ప్రత్యేక వెబ్ సైట్ లో చేర్చింది. nehruinternationalconference2014.com పేరుతో రూపొందించిన సైట్ ను సదస్సు రోజున కాంగ్రెస్ ప్రారంభిస్తుంది. అందులో నెహ్రూ జీవితం, ఆయన రచనలు, కొటేషన్ లు, ఆయన ప్రముఖ ప్రసంగాలు ఉంటాయి. అందులో ప్రముఖ వ్యక్తులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐదేళ్ళ పూర్తి కాలం పదవిలో వున్న మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి వాజ్ పేయిలు నెహ్రూపై చేసిన వ్యాఖ్యలను కూడా సైట్ లో చేర్చారు.
"వ్యక్తిగత స్వేచ్ఛకు ఆయన న్యాయవాదిలాంటివాడు. ఇప్పుడు ఆర్థిక సమానత్వం తీసుకురావాలన్న దానికి కట్టుబడి ఉన్నారు. ఎవరితోనైనా రాజీపడేందుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు, అలాగని భయపడి కూడా ఎవరితోనూ రాజీపడరు" అని నెహ్రూ గురించి ఒకప్పుడు వాజ్ పేయి పేర్కొన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి ప్రధానిగా పూర్తికాలం పనిచేసిన వాజ్ పేయి 'భారతీయ రాజనీతిజ్ఞుడు'గా పేరుతెచ్చుకున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి