ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అహ్మదాబాదులోని సర్దార్ పటేల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. కటక్ వన్డేలో భారీ విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ లోనూ నెగ్గి ఆధిక్యం పెంచుకోవాలని భావిస్తోంది. అటు, శ్రీలంక తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ధావన్, రహానే, కోహ్లీ, రైనాలతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ భీకరమైన ఫామ్ లో ఉండగా, బౌలర్లు సైతం విశేషంగా రాణిస్తున్నారు. తొలి వన్డేలో 152.1 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన వరుణ్ ఆరోన్ గాయపడడం ఒక్కటే నిరాశపరిచే అంశం. ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ జట్టులోకొచ్చాడు. అయితే, తుది జట్టులో బిన్నీకి స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు.
వరల్డ్ కప్ సన్నాహాలను మధ్యలోనే ఆపేసి, హడావుడిగా భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకకు ఇక్కడి పరిస్థితులు కొత్తేమీ కాదు. తొలి మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న లంక బౌలర్లు రెండో వన్డేలో కుదురుకుంటారని కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఆశిస్తున్నాడు. సీనియర్ బౌలర్లు లసిత్ మలింగ, రంగన హెరాత్ గైర్హాజరీలో లంక బౌలింగ్ దాడుల భారం దమ్మిక ప్రసాద్, గామగే, తిసర పెరీరా, సూరజ్ రణ్ దివ్ లపై పడింది. కటక్ మ్యాచ్ లో రణ్ దివ్ (3 వికెట్లు) మినహా మరెవ్వరూ కోహ్లీ సేనపై ప్రభావం చూపలేకపోయారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి