ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి బుధవారం సరికొత్త ఆరోపణలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు కలసి తమ ఓటమికి కుట్ర పన్నాయని ఆమె ఆరోపించారు. కనీవినీ ఎరుగని రీతిలో మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అనైతిక కుట్రకు పాల్పడ్డాయని, ఆ కారణంగానే ఎన్నికల్లో తాము ఓటమి చవిచూశామని ఆమె ఆవేదన వెళ్లగక్కారు.
రాజకీయ పార్టీగానే కాక సామాజిక ఉద్యమానికి బాటలు వేసిన పార్టీగానూ బీఎస్పీ అవతరించిందని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాయావతి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన పార్టీగా బీఎస్పీ తన గురుతర బాధ్యతలను నెరవేరుస్తోందన్నారు. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ తన సొంత సత్తాతో గెలవలేదని, కాంగ్రెస్ పై ఆ రాష్ట్రాల్లో వ్యక్తమైన వ్యతిరేకతే వారి విజయానికి కారణంగా నిలిచిందనీ అన్నారు. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున బరిలోకి దిగుతున్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే ఎత్తుగడల్లో భాగంగానే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి