మహారాష్ట్రలో శివసేన తన సహజసిద్ధ పంథాను వీడేలా కనిపించడం లేదు. మొండిపట్టుదలతో 25 ఏళ్ల నాటి బీజేపీ దోస్తీకి స్వస్తి చెప్పిన ఆ పార్టీకి మరిన్ని సీట్లు లభించినా, భంగపాటు తప్పలేదు. ఫలితాల అనంతరం బీజేపీతో కాళ్ల బేరానికి వచ్చిన శివసేన, ప్రభుత్వంలో చేరతామని, మునుపటి దోస్తీకి మళ్లీ తలుపులు తెరవాలని కోరింది. దీనికి బీజేపీ కూడా సరేననడంతో పార్టీకి మునుపటి ప్రాభవం వచ్చినట్టేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భావించారు. అంతే, తిరిగి తన పాత మంకుపట్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. తాము అడిగిన మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ లో బెర్తుల ఖరారును శనివారంలోగా ముగించాలని కోరారు. దీనికి బీజేపీ కూడా సరేనన్నా, శివసేన అడిగినన్ని బెర్తులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేదు.
డిప్యూటీ సీఎంతో పాటు ఐదు కేబినెట్ హోదాలతో కలిపి పది మంత్రి పదవులు ఇవ్వాలని ఉద్ధవ్ ప్రతిపాదించారు. అయితే డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేస్తున్నట్లు ఫడ్నవీస్ సర్కారు తేల్చిచెప్పింది. అయితే ఆరు కేబినెట్ హోదాలతో కూడిన 12 బెర్తులను కేటాయించండి అంటూ కొత్త ప్రతిపాదన బీజేపీ ముందుకొచ్చింది. ఉద్ధవ్ బీరాలను అంత సీరియస్ గా పరిగణించని బీజేపీ నాలుగు కేబినెట్ హోదాలతో కూడిన ఎనిమిది మంత్రి పదవులను శివసేనకు కేటాయించేందుకు సిద్ధమైంది. అసలే ముగిసిందనుకున్న స్నేహం చిగురించిన నేపథ్యంలో ఎన్ని బెర్తులు తగ్గినా, ఉధ్దవ్ మాత్రం అంగీకరించక తప్పేలా లేదు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్