హుదూద్ తుపాను సంభవిస్తుందన్న నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలు, ముందుచూపువల్లే ప్రాణనష్టాన్ని చాలావరకు తగ్గించగలిగామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో తుపాను నష్ట నివారణకు తీసుకున్న చర్యలపై అన్ని రాష్ట్రాలకు బ్లూప్రింట్ లు పంపుతామని చెప్పారు. మొన్న, నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందన్నారు. విశాఖ కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తుపాను తర్వాత రెండు రోజులకే విశాఖ వాసులకు తాగునీటిని అందించామన్నారు. అటు చౌక దుకాణాల్లో అందరికీ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయని, విశాఖలో ప్రతి పౌరుడు చౌక దుకాణాల్లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చన్నారు.
ప్రస్తుతం నగరంలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్న సీఎం, రాత్రివేళ స్వయంగా పర్యవేక్షించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేశామని చెప్పారు. ఇక చాలాచోట్ల సెల్ ఫోన్ సిగ్నళ్ల పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. అటు తుపాను సహాయక చర్యలపై హైదరాబాదులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విశాఖలో పది మురికివాడల్లో వైద్య శిబిరాలు పెట్టినట్లు చెప్పారు. 9 లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు, చేనేత, మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్