ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. అప్పటికి వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి కావాలన్న లక్ష్యంతో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లకు మరమ్మతులు, ప్రధాన కూడళ్లలో ఆర్చీలు, స్వాగత తోరణాలు, వివిధ రకాల దేవతామూర్తుల కటౌట్లు, ఆలయానికి ఆకర్షణీయంగా విద్యుద్దీపాలంకరణ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. టీబీసీ కూడలిలోని భారీ చెట్టు చుట్టూ ఈ ఏడాది తొలిసారిగా దశావతరాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. వాటికి రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.
భక్తులను ఆకర్షించేలా మాడవీధుల్లో ఆకర్షణీయంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ఇక కొన్నాళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న నూతన కొలువు మండపం నిర్మాణ పనులు కూడా పూర్తికావస్తున్నాయి. అలాగే తిరువీధుల్లో అక్కడక్కడా చలువపందిళ్లు, పచ్చతోరణాలు ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరు అవుతుండడంతో.... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి