అమ్మాయిల హాస్టల్లో అర్ధరాత్రి ఓ ఆగంతుకుడు ప్రవేశించిన వ్యవహారం విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. నెల్లిమర్లలోని వేణుగోపాలపురం కాలనీలో సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజి, హైస్కూలు, హాస్టల్ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. కొత్తగా డార్మిటరీ నిర్మాణం జరుగుతోంది. దాంతో కొన్ని కిటికీలు తొలగించి ఉన్నాయి. నాలుగో తేదీ అర్ధరాత్రి 12 గంటలకు.. తొలగించిన ఓ కిటికీలోంచి ఓ ఆగంతుకుడు నగ్నంగా లోపలకు ప్రవేశించాడు.
టీచర్స్ డే కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టీస్ చేసిన విద్యార్థినులు గాఢనిద్రలో ఉండడంతో, నెమ్మదిగా అమ్మాయిల పక్కన పడుకుని వారి దుస్తులను కూడా బ్లేడుతో తొలగించాడు. అతని చేష్టలకు మెలకువవచ్చిన బాలికలు కేకలు వేశారు. కాగా, విద్యార్థినులు కేకలు వేసిన అరగంటకు కానీ వార్డెన్, ప్రిన్సిపల్ రాలేదు. ఈలోగా ఆగంతుకుడు దుప్పటి కప్పుకొని పారిపోయాడు.
ఏడో తేదీన కొంతమంది తల్లిదండ్రులు రావడంతో విద్యార్థినులు జరిగిన విషయం వారికి వివరించారు. వారి ఫిర్యాదుతో జడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి, సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ శేషుకుమారి విచారించారు. కాగా ఆగంతుకుడి రూపంలో విద్యార్థినుల దగ్గరికి వెళ్లింది ప్రిన్సిపల్ భర్తేనని పలు విద్యార్థి సంఘాల నేతల ఆరోపిస్తున్నారు. వివాదం సద్దుమణగకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, అక్కడ పని చేస్తున్న కూలీలను విచారిస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి