తండ్రిని కోల్పోయిన తర్వాత రాజకీయాల్లో ఎవరూ తోడులేని వ్యక్తిగా మిగిలిపోయిన వైయస్ జగన్ కు అండగా ఉండాలనే వైకాపాలో చేరానని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ లు తనకు తోడుగా ఉంటామని చెప్పినా... రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే జగన్ వెంట నడిచానని తెలిపారు. వైయస్ మరణం సహజం కాదని... కుట్ర అని మొదట చెప్పిన వ్యక్తిని తానే అని చెప్పారు. కానీ, ఆ తర్వాత వైకాపాలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయిని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జగన్ ను అరెస్ట్ చేసిన రోజున వైయస్ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టారని... ఆ రోజున వారి కుటుంబ సభ్యులతో పాటు తాను, సబ్బం హరి మాత్రమే ఉన్నామని వెల్లడించారు.
దీనికి సంబంధించి అందరిపై కేసు నమోదయిందని... ఆరుగురు వ్యక్తుల (విజయమ్మ, భారతి, షర్మిల, సుబ్బారెడ్డి, తాను, బ్రదర్ అనిల్)కు సమన్లు తీసుకుని వచ్చిన కానిస్టేబుల్ తో జూపూడి ఎవరో తమకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పారని తెలిపారు. ఈ విషయం చెబుతున్నప్పుడు జూపూడి స్వరం బొంగురుపోయింది. తానెవరో తెలియదనడం తననెంతో బాధించిందని అన్నారు. ఆ తర్వాత వారందరూ కలసి ఓ లాయర్ ను పెట్టుకున్నారని... తాను విడిగా మరో లాయర్ ను పెట్టుకున్నానని వెల్లడించారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్