మీడియాలో స్వార్ధం పెరిగిపోయింది: విజయ్ గోయల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీడియాలో స్వార్ధం పెరిగిపోయింది: విజయ్ గోయల్

తామంతా వార్తాపత్రికలు చదువుతూనే ప్రపంచాన్ని తెలుసుకున్నామని రాజస్థాన్ బీజేపీ ఎంపీ విజయ్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, మీడియాలో పెయిడ్ న్యూస్ సంస్కృతి పెరిగిపోయిందని, దాని కారణంగా మీడియాలో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. న్యూస్ లో ఎడిటోరియల్, ఎడిటర్ల శ్రమ తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మీడియా సమాజానికి వివేచన నేర్పేలా వార్తలు ప్రచురించేదని ఆయన అన్నారు. అయితే, ఇప్పుడు మీడియా అలా లేదని ప్రకటనల కోసం మాత్రమే పనిచేస్తోందని, అందుకే వార్తా సంస్థల స్థాయి దిగజారిపోయిందని అన్నారు. సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆయన రాజ్యసభకు తెలిపారు.

More Telugu News