ఇంచియాన్ ఆసియా క్రీడల సందర్భంగా నిర్వహించే క్రికెట్ టోర్నీలో టీమిండియా పాల్గొనబోవడంలేదని బీసీసీఐ తెలిపింది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఆసియా క్రీడల సమయంలోనే చాంపియన్స్ ట్రోఫీ జరగనుందని వెల్లడించారు. కాగా, 17వ ఆసియా క్రీడలు దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరగనున్నాయి. ఆసియా క్రీడలకు దక్షిణకొరియా ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1986 లో సియోల్, 2002లో బుసాన్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించారు.
కాగా, చైనాలో జరిగిన గత ఆసియా క్రీడల సందర్భంగా క్రికెట్ క్రీడాంశాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా భారత్ జట్టు హాజరుకాలేదు. ఈసారి టోర్నీకి పాకిస్థాన్ జట్టు కేవలం మహిళల జట్టునే పంపుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ మాత్రం పురుషుల, మహిళల జట్లను పంపాలని నిర్ణయించుకున్నాయి. ఆసియా క్రీడల్లో భాగంగా క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతాయి.
ఈ టోర్నీ పురుషుల విభాగంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, దక్షిణకొరియా, చైనా, నేపాల్, మలేసియా, మాల్దీవులు, కువైట్ తలపడతాయి. మహిళల విభాగంలో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, జపాన్, మలేసియా, నేపాల్, థాయ్ లాండ్ జట్లు పోటీపడనున్నాయి.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్