ఆడియో వేడుకకు వచ్చి ఇక్కడ కూర్చుని తాను చాలా ఆలోచించానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ‘రభస’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ... 17 ఏళ్ల వయసులో తాను ఓ తండ్రికి కొడుకుగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టానని... ఇప్పుడు అభిమానుల ఆశీస్సులతో ఇంతలా ఎదిగానని... చాలా మంది అభిమానానికి పాత్రుడినయ్యానని అన్నారు. తనను ఇంతలా ఆదరించిన ఆప్తులకు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు.
తన క్షేమం కాంక్షించే వారందరి అభిమానం అలాగే ఉంది కనుక తన భార్యాబిడ్డ క్షేమంగా ఉన్నారని ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘రభస’ సినిమా ఎన్నో కష్టాలు దాటుకుని పూర్తయిందన్నారు. దర్శకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, సినిమా నిర్మాణం ఆలస్యమైందని... అయినా సరే, సినిమా అభిమానులను అలరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన స్వరాలు సమకూర్చిన తమన్ కు ధన్యవాదాలు అని ఎన్టీఆర్ తెలిపారు.
దర్శకుడి కష్టం కోసమైనా సినిమా సూపర్ హిట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆది’ సినిమా నాటికి తానే పిల్లాడ్నైతే, తన ముందు మరో ఇద్దరు పిల్లలు ఉండేవారని వారే బెల్లంకొండ గణేష్, ‘అల్లుడు శీను’ బెల్లంకొండ శ్రీనివాస్ అని అన్నారు. వారు ఒకరు నిర్మాతగా, మరొకరు సినీ హీరోగా ఎదగడం తనను ఆనందానికి గురి చేసిందని అన్నారు. అలాగే అభిమానులకు ఏదయినా జరిగితే తట్టుకోలేనని తెలిపిన ఎన్టీఆర్, తండ్రి అయ్యాక బిడ్డ విలువ తెలుస్తుందని అన్నారు.
మీ తల్లిదండ్రులు కూడా మీకేమీ కాకూడదని కోరుకుంటారని, అందుకే అభిమానులంతా జాగ్రత్తగా ఇంటికెళ్లండని ఆయన అభ్యర్థించారు. అభిమానులు, ఆప్తుల కోరిక మేరకు ‘రభస’ సినిమాలో తాను పాడిన పాట పల్లవి పాడి జూనియర్ ఎన్టీఆర్ అందర్నీ అలరించాడు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి