అండర్సన్, జడేజా వివాదానికి ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ (ఐసీసీ) ముగింపు పలికింది. ఆరు గంటల విచారణ తర్వాత ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లిద్దరూ తప్పు చేయలేదని ఐసీసీ ప్రకటించింది. అలాగే, జడేజాపై ఫీజు కోత నిర్ణయాన్ని ఐసీసీ వెనక్కి తీసుకుంది.
క్రికెట్ మైదానంలో అండర్సన్, జడేజా మధ్య మాటా మాటా పెరిగింది. అండర్సన్ జడేజాపై నోరు పారేసుకున్నాడు. దానికి జడేజా దీటుగా జవాబిచ్చాడు. దీంతో, మొదలైన వివాదంలో తొలుత జడేజాను తప్పుబట్టిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అయితే, దీనిపై బీసీసీఐ అప్పీలుకు వెళ్లింది. అంతే కాకుండా జరిగిన దాంట్లో అండర్సన్ దే తప్పు అని, అతడు అన్న మాటలకు జడేజా జవాబు ఇచ్చాడని బీసీసీఐ సాక్ష్యాలతో ఐసీసీ ముందుకెళ్లింది. దీంతో, ఈ వివాదంపై అందరి దృష్టి మరలింది. బీసీసీఐ వాదనతో అందరూ అండర్సన్ పై చర్య తీసుకుంటారని ఆశించారు. అయితే, అందుకు భిన్నంగా ఇప్పుడు ఐసీసీ అండర్సన్ ను వెనకేసుకొచ్చినట్లయింది. అంతేకాకుండా, దీంట్లో వారిద్దరి తప్పేమీ లేదని చెప్పటం మరో వివాదానికి దారితీస్తుందేమో!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి