గోవా తీరంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విహారయాత్ర నిమిత్తం గోవాకు దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో, అక్కడి బీచ్ లు ఇసుకేస్తే రాలనంతగా తయారయ్యాయట. ఈ పరిణామం కాస్తా అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ళ పాలిట శాపంగా పరిణమించింది. వాటి జీవితచక్రాన్ని అనుసరించి అవి గుడ్లు పెట్టేందుకు తీరప్రాంతానికి రావాల్సి ఉంటుంది. పర్యాటకుల తాకిడి కారణంగా తీరానికి వచ్చేందుకు వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
టూరిస్టుల రాకతో రాత్రివేళల్లోనూ బీచ్ లలో లైట్లు వెలుగుతుండడంతో ఈ వలస తాబేళ్ళు గుడ్లు పెట్టేందుకు తగిన నెలవులను ఎన్నుకొనలేకపోతున్నాయని గోవా అటవీ శాఖ మంత్రి అలీనా సల్దానా చెప్పారు. తాబేళ్ళు గుడ్లు పెట్టే కాలంలో బీచ్ లలో రాత్రివేళ లైట్లు వేయరాదని, పెద్దగా ధ్వనులను వినిపించరాదని ఆదేశాలు జారీచేసినట్టు సల్దానా వెల్లడించారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ప్రతి ఏడాది వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఒడిశా, గోవా తీరాల్లో గుడ్లు పెడతాయి. అనంతరం అవి సముద్రంలోకి వెళ్ళిపోగా, గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు తిరిగి సముద్రంలోకి చేరుకుంటాయి.
ఈ క్రమంలో గుడ్లకు, పిల్ల తాబేళ్ళకు ఎన్నో ప్రతికూల శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. నక్కలు ఇసుకను తవ్వి గుడ్లను తినేస్తాయి. ఇక, ఈ తాబేలు పిల్లలు సముద్రంలోకి చేరుకునే క్రమంలో గ్రద్దలకు, ఇతర పక్షులకు ఆహారంగా మారతాయి. మిగిలిన కొన్ని తాబేళ్ళు మాత్రమే సముద్రంలోకి వెళతాయి.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి