ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ప్రపంచ జనాభాలో 85 శాతం మంది ప్రజలు నివసించే ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ లు వినియోగంలో ఉన్నాయి. కానీ, 30 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఫేస్ బుక్ వినియోగం విస్తృతంగా ఉండడంతో మొబైల్ వినియోగం ఉన్న ప్రతి చోట ఫేస్ బుక్ వినియోగం ఉండేలా 'ఇంటర్నెట్.ఆర్గ్' పేరిట ఓ యాప్ ను ఫేస్ బుక్ విడుదల చేసింది.
దీనిని డౌన్ లోడ్ చేసుకుంటే ఎవరైనా తమ ఫోన్ లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా పొందవచ్చు. స్థానికంగా అందే వైద్యం, విద్య, ఉద్యోగావకాశాలు, వాతావరణానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కోసం ఫ్రీగా బ్రౌజ్ చేసుకోవచ్చని ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకెర్ బర్గ్ వెల్లడించారు. ఈ యాప్ తో ఫేస్ బుక్, గూగుల్ సెర్చ్, వికీపీడియాను కూడా వినియోగించుకునే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు.
అయితే, ఈ యాప్ అప్పుడే మనకి అందుబాటులో లేదు. జాంబియాలో ఎయిర్ టెల్ వినియోగదారులు ప్రస్తుతానికి ఈ సౌకర్యం పొందుతున్నారు. ఇక్కడి ఫీడ్ బ్యాక్ ను ఆధారంగా చేసుకుని మిగిలిన దేశాల్లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని జుకెర్ బర్గ్ తెలిపారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్