ఉత్తరప్రదేశ్ బిస్కెట్ కింగ్ ఓంప్రకాశ్ దాసాని కోడలు జ్యోతి దాసానిని ఆమె భర్తే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనేక విషయాలు కనుక్కున్నారు. పియూష్ దాసాని భయంకరమైన స్త్రీలోలుడని పోలీసులు వెల్లడించారు. పెళ్లయిన తరువాత పక్కింట్లో ఉండే పాన్ మసాలా కంపెనీ యజమాని కుమార్తె మనీషా మఖీజాను ముగ్గులోకి దింపడమే కాకుండా పలువురు యువతులతో అక్రమ సంబంధాలు నెరిపాడు.
అతడి కాల్ లిస్టు సేకరించిన పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. గత రెండు నెలల కాలంలో మనీషా మఖీజాకు 663 సార్లు ఫోన్ చేశాడు. తమ కంపెనీలో పని చేసే మరో యువతికి 330 సార్లు ఫోన్ చేశాడు. ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయట. అది పక్కన పెడితే తన ప్రియురాలితో నిత్యం మాట్లాడేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మనీషా మఖీజాకు ఐదు సిమ్ కార్డులు నకిలీ అడ్రస్ లతో కొనిచ్చాడట.
వీరి వ్యవహారం పసిగట్టి అడ్డుపడుతుండడమే కాకుండా, విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు బట్టబయలు చేసిందన్న కోపంతో భార్యను ప్రియురాలి డ్రైవర్, అతడి స్నేహితుడి సాయంతో కసిదీరా 14 సార్లు పొడిచి చంపాడు. ఈ విషయాలు తెలిసిన తరువాత విచారణ కోసం న్యాయస్థానానికి పియూష్ హాజరవ్వగా న్యాయవాదులు మూడు సార్లు దాడి చేశారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి