మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో కొండకు దిగువ భాగాన కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే, వర్షాల కారణంగా కొండపై మట్టిదిబ్బలు కరిగి వారి నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో 40 నివాసాలు ధ్వంసం కాగా, 51 మంది చనిపోయారు. 150 మంది ఆచూకీ తెలియరాలేదు. అయితే, సహాయకచర్యలు చేపట్టిన అధికారులకు ఓ ప్రాంతం నుంచి చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది.
అక్కడికెళ్ళి బురద తొలగించి చూడగా ఓ పాప తన తల్లి సహా కనిపించింది. ఆ తల్లి తన చిన్నారిపై మట్టి పడకుండా రక్షణగా తన శరీరాన్ని కప్పేసిన స్థితిలో ఉంది. వారిద్దరినీ బయటికి తీస్తుండగానే, అక్కడే మరో ఇద్దరు సహాయం కోసం కేకలు వేశారు.
అరుపులు వినపడ్డ ప్రదేశంలో మట్టిని తొలగించగా ఆ పాప బామ్మ, తాతయ్యలు బయటపడ్డారు. ఆ పాప ఏడుపు ఆ విధంగా ఓ కుటుంబం ప్రాణాలు నిలబెట్టింది. ఆ చిన్నారి పేరు రుద్ర, వయసు మూడు నెలలే. తాను బిడ్డకు పాలు ఇస్తుండగా ఒక్కసారి మట్టిదిబ్బలు విరిగి ఇంటిపై పడ్డాయని రుద్ర తల్లి చెప్పింది.
ఇక, రుద్ర బామ్మ శకుంతల మాట్లాడుతూ, తామెలా బతికామో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. ప్రస్తుతం వారు నలుగురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి తీవ్రగాయాలేమీ కాలేదని, పొరుగువారు మృత్యువాత పడడంతో షాక్ కు గురయ్యారని వైద్యులు తెలిపారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్