ఇజ్రాయెల్, హమాస్ పోరు నడుమ అమాయక పౌరులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులు దాడుల్లో మరణిస్తున్నారు. మరికొందరు బాలలు తీవ్రగాయాలతో ఆసుపత్రి బెడ్ లపై రోదిస్తున్నారు. ఈ క్రమంలో గాజాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అలాలియా అనే పదేళ్ళ బాలుడు ప్రపంచనేతలను తమ దుస్థితిపై ప్రశ్నించాడు. మిగతా ప్రపంచంలోని బాలల మాదిరే తమకెందుకు స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గాజా చిన్నారులు స్వేచ్ఛాయుత భూభాగంలో లేనందుకు తనకెంతో బాధగా ఉందన్నాడు.
"గాజా బాలలకెందుకు స్వేచ్ఛా హక్కు లేదు?" అని ప్రశ్నించాడు. తమకు స్వేచ్ఛ ప్రసాదించాలని తాను ప్రపంచ నేతలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశాడు. కాగా, అలాలియా కాలినగాయాలు, విరిగిన చేతితో ఆసుపత్రిలో చేరాడు. అతని తల్లిని మీడియా ఇంటర్వ్యూ చేస్తుండగా, ఈ బాలుడు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. దీంతో, మీడియా ప్రతినిధి ఈ బాలుడి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి