జాక్వెస్ కలిస్..! ఎన్నో ఏళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు ఈ భారీకాయుడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో మురిసిపోయాయి. మైదానంలో ఇక, ఆ బ్యాటింగ్ ఒరవడి కనిపించదు, ఆ బౌలింగ్ రనప్ సవ్వడీ వినిపించదు. ఈ విషయం తలుచుకుంటే గుండె బరువెక్కని క్రికెట్ అభిమాని ఉండకపోవచ్చు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు కలిస్ బుధవారం ప్రకటించగానే అందరూ విచారం వ్యక్తం చేశారు.
ఈ మహోన్నత ఆల్ రౌండర్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నేడు స్పందించింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ ఓ ప్రకటన చేస్తూ, అన్ని ఫార్మాట్లలోనూ కలిస్ స్థిరత్వానికి ప్రతీకలా నిలిచిపోతాడని కొనియాడారు. క్రికెట్ చరిత్రలోనే అతనో అద్భుతమైన ఆల్ రౌండర్ అని పేర్కొన్నారు. 20 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి అనతికాలంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు మూలస్తంభంలా మారాడని అన్నారు.
కాగా, మూడు ఫార్మాట్లు కలుపుకుని కలిస్ 519 అంతర్జాతీయ మ్యాచ్ లాడి 25,534 పరుగులు చేశాడు. వాటిలో 62 సెంచరీలున్నాయి. బౌలింగ్ లో 577 వికెట్లు తీయడం విశేషం. ఫీల్డింగ్ లోనూ తన సత్తా చాటుతూ 338 క్యాచ్ లు అందుకున్నాడు.
ఇటీవలి శ్రీలంక పర్యటన కలిస్ కు చేదు అనుభవాలు మిగిల్చింది. మూడు వన్డేల్లో కలిపి ఐదే పరుగులు చేయడంతో కలిస్ క్రికెట్ నుంచి తప్పుకోవడమే మేలని భావించినట్టు సమాచారం.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్