అణుబాంబు ప్రయోగించే అధికారం ఆయా దేశాల అధినేతల వద్దే ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అయినా అదే పరిస్థితి. కానీ, అధినేత ఆదేశాలు మాత్రమే జారీచేస్తాడు, మరి మీట నొక్కేదెవరు? అంటే, లెఫ్టినెంట్ ర్యాంకు, ఆపై స్థాయి అధికారులేనట. ప్రస్తుతం అమెరికాలో అణు బటన్ నొక్కే బాధ్యతలు ఓ భారత సంతతి అధికారి నిర్వర్తిస్తుండడం విశేషం. ఆయన పేరు రాజ్ బన్సల్. అమెరికా ఎయిర్ ఫోర్స్ 90వ మిస్సైల్ వింగ్ లో లెఫ్టినెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్ కాకుండా కెప్టెన్ జేమ్స్ షానన్ కూడా ఈ అణు ప్రోగ్రామ్ లో నియమితులయ్యారు.
కాగా, ఈ అణు ప్రోగ్రామ్ కోసం 10 మినిట్ మాన్-3 అణు మిస్సైళ్ళను సిద్ధంగా ఉంచారు. వీటిని చియెన్నే, వ్యోమింగ్, లింకన్, నెబ్రాస్కా ప్రాంతాల మధ్య ఓ బంకర్ లో దాచి ఉంచారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ప్రత్యేక కోడ్ తో వీటిని లక్ష్యం దిశగా ప్రయోగిస్తారు. ఇదిలావుంటే, ఈ బాధ్యతలు చేపట్టే అర్హతలున్న అధికారుల కోసం అమెరికా వాయుసేన ఓ పరీక్ష నిర్వహించగా, పలువురు చీటింగ్ కు పాల్పడ్డారట. ఈ స్కాం బట్టబయలు కావడంతో తొమ్మిది మందిని సస్పెండ్ చేయగా, మరో డజను మందిని మందలించి వదిలిపెట్టారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి