ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్, సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వస్ కలిస్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు కలిస్ ప్రకటించాడు. సఫారీ క్రికెట్ జట్టులో 'కింగ్'గా మన్ననలందుకున్న ఈ 38 ఏళ్ల క్రికెటర్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కష్టాల్లో ఉన్న ప్రతిసారి జట్టును సునాయాసంగా గట్టెక్కించి ఒంటి చేత్తో విజయాలు అందించిన కలిస్ 2013 డిసెంబరులో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
తాజాగా వన్డేల నుంచి కూడా అధికారికంగా తప్పుకుంటున్నట్టు కలిస్ స్పష్టం చేశాడు. తన కెరీర్లో 328 వన్డేలు ఆడి 17 సెంచరీలు, 86 అర్థ సెంచరీలతో 11,579 పరుగులు చేసిన కలిస్... 166 టెస్టుల్లో 45 సెంచరీలు, 58 అర్థ సెంచరీలతో మొత్తం 13,289 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో కలిస్ అనితరసాధ్యమైన గణాంకాలు నమోదు చేశాడు. కలిస్ ఆడిన 328 వన్డేల్లో 273 వికెట్లు తీయగా, 166 టెస్టుల్లో 292 వికెట్లు పడగొట్టి తనకు ఎవరూ సాటిలేరని నిరూపించాడు.
అంతర్జాతీయంగా తన కెరీర్ ముగిసిందని ప్రకటించిన కలిస్, టీ20ల్లో సిడ్నీ థండర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల సభ్యుడిగా కొనసాగాలనుందని చెప్పాడు. కాగా, కలిస్ రిటైర్మెంట్ ను దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్ స్వాగతించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న కలిస్ ను దక్షిణాఫ్రికా మరువదని తెలిపారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి