ఆన్ లైన్ వ్యాపారంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ భారత్ లో 6 వేల కోట్లు పెట్టుబడిగా పెడతానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి ఓ రోజు కూడా గడవకుండానే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ 2 బిలియన్ డాలర్లు (12 వేల కోట్ల రూపాయలు) పెట్టుబడులను భారత్ లో పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చుకున్నట్లు అమెజాన్.కామ్ తెలిపింది. ఈ పెట్టుబడులతో భారీ ప్రణాళికలను రూపొందించడానికి అమెజాన్ సిద్ధమైంది. అంతేకాదు, భారత్ లో భారీ ఎత్తున వినియోగదారులను ఆకర్షించుకునేందుకు ఈ నిధులను వినియోగించుకుంటామని అమెజాన్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
ఏడాది క్రితం భారత్ లోకి ప్రవేశించిన అమెజాన్.కామ్ కి... దేశంలో ఇప్పటివరకు ఐదు గోడౌన్ లున్నాయి. తమ గోడౌన్ల సామర్థ్యాన్ని 5 లక్షల చదరపు అడుగులకు పెంచాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగం భవిష్యత్తులో అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తుందని అమెజాన్.కామ్ విశ్వసిస్తోంది. అందుకే భారత్ కు ఈ సంస్థ నిధుల వరద పారిస్తోంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్