అతడో ఇంజినీర్ అవుతాడని భావిస్తే... ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి కార్లను అద్దెకు తీసుకుని, వాటితో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేయడం ఇతడి నైజం. హైదరాబాదు యూసుఫ్ గూడలో నివాసముండే తేజ మోహన్ రాజు స్వస్థలం కడప. అతడు మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో జల్సాలకు అలవాటు పడ్డాడు. అయితే, తల్లిదండ్రులు ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటి నుంచి అతని ఖర్చులకు తగిన పాకెట్ మనీ అందడం లేదు. దీంతో, అతను పక్కదారి పట్టాడు.
స్నేహితులు వినాయక, ప్రసాద్ లతో కలిసి టోలిచౌకీలోని నూర్ ట్రావెల్స్ నుంచి వాహనాలను అద్దెకు తీసుకునేవాడు. అయితే, అవి చెడిపోయాయని ట్రావెల్స్ యాజమాన్యాన్ని నమ్మించేవాడు. అదే ట్రావెల్స్ నుంచి మరో వాహనం తీసుకుని, అంతకుముందు అద్దెకు తీసుకున్న వాహనాన్ని అమ్మేసేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఓసారి ఇలాగే అద్దెకు తీసుకున్న ఇన్నోవా వాహనం బెంగళూరులో చెడిపోయిందని, దాన్ని తీసుకొచ్చేందుకు మరో వాహనం కావాలని అడగ్గా ట్రావెల్స్ వారు స్విఫ్ట్ డిజైర్ ఇచ్చారు.
అయితే, ఆ కారు తీసుకెళ్ళిన తేజ మళ్ళీ రాకపోవడంతో ట్రావెల్స్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తేజ, వినాయకను బహదూర్ పురా వద్ద ఆ రెండు వాహనాలు సహా అదుపులోకి తీసుకున్నారు. వాటిలో 60 కేజీల ఎర్రచందనం కూడా ఉంది. తాము ఎర్రచందనాన్ని కడప నుంచి కర్ణాటకలోని కోలార్ కు స్మగ్లింగ్ చేస్తుంటామని తేజ వెల్లడించాడు. నరేశ్, నయీం, జకీర్ అనే స్మగర్లు ఒక్కసారి రవాణా చేస్తే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇచ్చేవారని తేజ తెలిపాడు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్