రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ పలు విషయాలు ప్రస్తావించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరుకు 660 కి.మీ. దూరం ఉంటుందని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటుపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ మరికొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాజమండ్రి, కాకినాడతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో తాము పర్యటించి... ఆ జిల్లాలో ఎంత భూమి ఉందన్న వివరాలను సేకరిస్తామని ఆయన చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి ఉన్న ప్రాంతం రాజధానికి అనువైనదని నారాయణ అన్నారు. రాజధాని కోసం 25 వేల ఎకరాలు ఉన్న ప్రాంతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉందని, అయినా అత్యుత్తమ రాజధాని కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి