ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిక్’ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. షాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ‘కిక్’ రూ.100 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ పరిశ్రమ వర్గాల సమాచారం. సల్మాన్ సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడం కొత్తేమీ కాదు... గతంలోనూ దబాంగ్, బాడీగార్డ్, రెడీ, ఏక్ థా టైగర్, దబాంగ్-2 సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం విదితమే.
ప్రతి రంజాన్ పండుగకు సల్లూ భాయ్ సినిమా తప్పనిసరిగా ఉంటూ వస్తోంది. రంజాన్ పండుగ సల్మాన్ ఖాన్ కు కలిసివస్తోంది. ఈద్ పండుగకు విడుదలయ్యే సల్మాన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్నాయి. అలాగే ఈసారి ఈద్ పండుగకు ‘కిక్’ థియేటర్లలో సందడి చేస్తోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 5 వేల స్క్రీన్ లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాకు మాతృక... తెలుగులో రవితేజ నటించిన కిక్ సినిమా. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘కిక్’... ఇప్పుడు బాలీవుడ్ లోనూ రికార్డులను షేక్ చేస్తోంది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్