ఎన్నో ఔషధాలు ప్రకృతిలో లభిస్తాయని తెలిసినా మనం వాటి జోలికెళ్ళం. ఏమైనా అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తే ఓ ట్యాబ్లెటో, క్యాప్సూలో మింగుతాం. కానీ, మన చుట్టూ ఉండే వృక్ష జాతులెన్నింటికో ఔషధ విలువలున్నాయని, వాటితో తయారైన మందులు శరీరానికి మంచిదని వేదకాలం నుంచీ పెద్దలు మొత్తుకుంటున్నారు. తులసి, మారేడు, అతిమధురం వంటి మొక్కల గురించి అవి చేసే మేలు గురించి తెలిసిందే. నల్లమిరియాలూ వీటి కోవలోకే వస్తాయి. గృహవైద్యంలో భాగంగా వీటిని ఉపయోగించి సత్ఫలితాలు రాబట్టవచ్చు. నల్ల మిరియాలతో ముఖ్యంగా వర్షాకాలం వేధించే అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు. జలుబు, దగ్గు, అజీర్తి, కండరాల నొప్పులకు ఇవి దివ్యంగా పనిచేస్తాయట. వీటితో ఏమేం ఉపయోగాలున్నాయో చూద్దాం.
నల్ల మిరియాల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ పదార్థాలు జలుబు కారక సూక్ష్మజీవులను సమర్థంగా ఎదుర్కొంటాయి. అంతేగాకుండా ఛాతీలో నెమ్మును తగ్గిస్తాయి. పైగా, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
వీటిలో యాంటీఆక్సిడాంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. ఈ యాంటీఆక్సిడాంట్లు కణ వినాశనాన్ని అరికడతాయి. తద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
ఔషధ విలువల రీత్యా ఇవి చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. విటిలిగో వంటి చర్మవ్యాధులు సైతం నల్లమిరియాలతో తగ్గుముఖం పట్టాల్సిందే.
ఆర్త్రైటిస్ నయం చేయడంలో వీటి పాత్ర ప్రముఖమైనది. మోకాళ్ళ వద్ద ఉండే కార్టిలేజ్ టిష్యూలో వాపును తగ్గిస్తాయి.
జీర్ణక్రియ సాఫీ సాగేందుకు నల్లమిరియాలు తీసుకోవడం ఉత్తమం. తద్వారా జీర్ణ రసాల ఉత్పత్తి మెరుగువుతుంది. డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.
నల్లమిరియాలను వంటకాల్లో వేయడం కంటే మెత్తగా పొడిలా తయారుచేసి వేడి పాలల్లో కలిపి తీసుకుంటే శ్రేయస్కరం.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి