కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా మరాఠీ వాసుల సమస్య తాజాగా కర్నాటక, మహారాష్ట్రల మధ్య రాజకీయ వివాదాన్ని రేపింది. బెల్గాం జిల్లాలోని మరాఠీ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు మహారాష్ట్రకే చెందుతాయంటూ బెల్గాం జిల్లాలోని యెల్లూరు గ్రామం దగ్గర అక్కడి స్థానిక ప్రజలు బోర్డు పెట్టారు. దీనిపై హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం కర్ణాటక పోలీసులు ఈ బోర్డును తీసివేశారు. దీంతో అక్కడి గ్రామస్థులు 'మహారాష్ట్ర రాజ్య' అంటూ మరో బోర్డును శనివారం మళ్లీ పెట్టారు. శనివారం వెలిసిన మరో బోర్డును కూడా పోలీసులు తీసివేయడంతో... ఆదివారం గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బెల్గాం జిల్లాలోని మరాఠీ ప్రజలపై పోలీసులు ఆదివారం చేసిన లాఠీఛార్జి సోమవారం నాటికి రాజకీయ రంగు పులుముకుంది. మరాఠీ ప్రజలపై కర్నాటక పోలీసులు గూండాగిరి చేస్తున్నారని శివసేన గళమెత్తింది. కొన్ని దశాబ్దాలుగా కర్ణాటకలోని మరాఠీ గ్రామాలను మహారాష్ట్రలో కలపాలని ఉద్యమం చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ్ సమతి పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించింది. ఇక ఈ విషయంపై ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే బీజేపీని... దాని మిత్రపక్షమైన శివసేనను తీవ్రంగా దుయ్యబట్టారు. కర్ణాటకలో కొన్ని దశాబ్దాలుగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న మరాఠా ప్రజలంటే బీజేపీ-శివసేన కూటమికి ఏమాత్రం సానుభూతి లేదని ఆయన వ్యాఖ్యానించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి