తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఆపద మొక్కులవాడని పేరుంది. అయితే ఆయన కొలువై ఉన్న తిరుమలలో భక్తులకు ఏ చిన్న ఆపద, అనారోగ్యం కలిగినా... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండ దిగి తిరుపతికి వెళ్లాల్సిందే. ఇటీవల తిరుమలలో వెంకన్న దర్శనం కోసం క్యూలైన్లో నిలుచున్న ఇద్దరు భక్తులను పాము కాటు వేసింది. వీరిని తిరుమల ఆశ్విని ఆసుపత్రికి తరలిస్తే అక్కడ పాముకాటుకు విరుగుడు మందైన యాంటీవీనం లభించలేదు. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వెళ్లేంతవరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బాధితులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఇలా ప్రతి చిన్నవిషయానికి తిరుపతికి పంపించడం తప్ప, కొండపై సరైన వైద్యసేవలు అందడం లేదని భక్తులు వాపోతున్నారు.
తిరుమల కొండపై విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి గృహం వద్ద రెండు డిస్పెన్సరీలున్నాయి. వీటితో పాటు వైకుంఠం 1, 2 క్యూకాంప్లెక్సుల వద్ద, డి టైప్ క్వార్టర్స్ వద్ద ఆసుపత్రులున్నాయి. వీటితో పాటు అశ్విని ఆసుపత్రి, టిటిడి పాలనావిభాగం దగ్గర సెంట్రల్ ఆసుపత్రి ఉన్నాయి. అయితే ఇన్ని ఆసుపత్రులు ఉన్నా వీటిలో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు తప్ప... బి.పి, షుగర్ మందులు కూడా ఉండవు. ఇలా అని ఈ ఆసుపత్రులకు మందుల సరఫరా లేదా అంటే... అది అబద్ధమే అవుతుంది. ప్రతీ ఏడాది సంవత్సరానికి అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ మొత్తం టీటీడీ ఆసుపత్రులకు మందులు సరఫరా అవుతాయి. అయితే వీటిని అక్కడా స్థానికంగా నివసిస్తున్నవారు లెక్కా పత్రం లేకుండా తీసుకుండడంతో...మందుల స్టాక్ వచ్చిన కొన్ని నెలలకే ఖాళీ అయిపోతోంది. ఇక పై ఓ లెక్కప్రకారం పేర్లు కంప్యూటర్లో నమోదు చేసుకుని స్థానికంగా ఉన్నవారికి మందులు సరఫరా చేయాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమలకు ఏటా సుమారు 2,500 కోట్ల ఆదాయం ఉంది. అయినా భక్తులకు కనీస ఆసుపత్రి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి