మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైష్ణవి (11) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 18కి చేరినట్లైంది. కాపలా లైని రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ప్రమాదం జరిగిన రోజే 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు బస్సు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన విద్యార్థులకు హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే చికిత్స పొందుతూ సోమవారం మరో విద్యార్థి తరుణ్ (9) మరణించాడు. తాజాగా చికిత్స పొందుతున్న క్రమంలోనే వైష్ణవి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసింది. వరుసగా ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. వైష్ణవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యశోదా ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి