కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఆదివారం భారత క్రీడాకారులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో భారత లిఫ్టర్లు సుతీశ్ శివలింగం బంగారు పతకాన్ని సాధించగా, ఇదే విభాగంలో మరో భారతీయుడు రవి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 328 కిలోల బరువు ఎత్తిన సతీశ్, కామన్వెల్త్ క్రీడల్లోనే ఈ విభాగంలో అత్యధిక బరువునెత్తి సరికొత్త రికార్డును లిఖించాడు. ఒకే విభాగంలో రెండు పతకాలను కైవసం చేసుకుని భారత లిఫ్టర్లు సంచలనం సృష్టించారు.
మరోవైపు షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఆదివారం కూడా సత్తా చాటారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో శ్రేయాసీ సింగ్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో మహ్మద్ అసబ్ కాంస్యం నెగ్గాడు. ఆదివారం నాడు వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో రెండు పతకాలు కూడా దక్కాయి. 69 కిలోల పురుషుల విభాగంలో ఓంకార్ ఒటారి, 63 కిలోల మహిళల విభాగంలో పూనమ్ యాదవ్ లు కాంస్య పతకాలు సాధించారు. దీంతో ఇప్పటిదాకా భారత్ ఖాతాలో ఆరు బంగారు పతకాలు చేరాయి. 9 రజత, 8 కాంస్య పతకాలతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్