ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు కృషిచేస్తానంటున్నారు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి, ఎంపీ గోకరాజు గంగరాజు. విజయవాడలో ఆదివారం ఆయనను 13 జిల్లాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రా క్రికెట్ సంఘాన్ని దేశంలోనే ఆదర్శ క్రికెట్ సంఘంగా మలుస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెటర్లకు ఎంఎస్కే ప్రసాద్ వంటి ఇంటర్నేషనల్ ప్లేయర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు.
కాగా, ఏసీఏ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని గంగరాజు పేర్కొన్నారు. వచ్చే నెల రెండోవారంలో విశాఖలో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్టు తెలిపారు. ఇక, ఈ వేడుకల్లో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాథ్ వంటి మాజీ క్రికెటర్లు కూడా పాల్గొంటారని గంగరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా మాజీ క్రికెటర్లకు రూ.2 కోట్ల 20 లక్షల రూపాయలను బహుమతిగా పంచుతామని వెల్లడించారు.
More Telugu News
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్