విద్యుత్‌తో నడిచే బస్సులు నడపాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీనగర్ - అహ్మదాబాద్ మధ్య ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్టు గుజరాత్ అధికారులు తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పాటు పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడే ఆలోచనతో మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా 2009లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్ట్ కార్యాచరణకు రావడం విశేషం.
సాంప్రదాయ ఇంధన వనరులైన డీజిల్, పెట్రోల్, గ్యాస్ తో వాహనాలను నడపడంతో గాలిలో కార్భన్ వాయువుల శాతం అధికమై వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో... గుజరాత్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో మోడీ తన హయాంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్టును డిజైన్ చేయించారు.
ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వరుకు 20 ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు....ఈ బస్సుల్లో విద్యుత్తును సోలార్ పవర్ ద్వారా జనరేట్ చేస్తారు...ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు.
More Telugu News
-
తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి