స్టూవర్ట్ బిన్నీ... లేటు వయసులో టీమిండియా బెర్త్ సంపాదించిన ఆటగాడు. కర్ణాటకకు చెందిన ఈ ఆల్ రౌండర్ క్రికెట్ కుటుంబం నుంచి వచ్చినవాడే. తండ్రి రోజర్ బిన్నీ భారత జట్టుకు పేస్ బౌలర్ గా సేవలందించారు. కాగా, స్టూవర్ట్ బిన్నీ ప్రతిభ చాన్నాళ్ళుగా తెరవెనుకే మిగిలిపోయింది. కెప్టెన్ ధోనీ గుర్తించడంతో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకోగలిగాడు.
అయితే, ఇంగ్లండ్ తో తొలి టెస్టుకు ముందు 30 ఏళ్ళ బిన్నీని తుదిజట్టులోకి ఎంపిక చేయడంపై విమర్శలు వినిపించాయి. ఎవరైనా కుర్రాళ్ళను ప్రోత్సహిస్తే బాగుండేదని మాజీ క్రికెటర్లు సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ, ధోనీ తన ఎంపికపై విశ్వాసముంచాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 145 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కోహ్లీ (8), రహానే (24), ధోనీ (11) విఫలమైన స్థితిలో బరిలో దిగిన బిన్నీ చక్కని ఇన్నింగ్స్ లో భారత్ ను 300 పరుగుల స్కోరు దాటించాడు.
78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బిన్నీ అవుటైనా అప్పటికే భారత్ సురక్షిత స్థితికి చేరుకుంది. ఒక్క ఇన్నింగ్స్ తో ఎంత మార్పు..! ఇప్పుడందరూ బిన్నీ ఎంపిక సరైనదేనని ధోనీని అభినందిస్తున్నారు. భారత్ లో ఓ మతంలా అవతరించిన క్రికెట్ లో ఇది సర్వసాధారణం అనుకోవాలేమో.
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి