వేడి వేడి దోసెలు తినాలని ఉందా? అయితే, హైదరాబాదు, మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ‘దోసె ప్లేస్’కి వెళ్లాల్సిందే. పెసరట్టు, మినపట్టు, ఉప్మా అట్టు వంటి సాంప్రదాయక రుచులే మనకు తెలుసు. కాలక్రమంలో అట్టు పేరు కాస్తా దోసెగా మారిపోయిన విషయం తెలిసిందే కదా. అక్కడ తీన్ మార్ దోసె, వెజ్ దోసె, పిజ్జా దోసె... వంటి రకరకాల దోసెలను రుచి చూడొచ్చు. అక్కడ మొత్తం 111 రకాల దోసె వెరైటీలు నోరూరిస్తున్నాయి. వీటి ధర రూ.30 మొదలుకొని రూ.150 వరకు ఉంది.
ఈ దోసె రుచిని చూసి హైదరాబాదీలు ఫిదా అవుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే సాయంకాలమైతే చాలు, దోసెలను తినేందుకు ఇక్కడ వాలిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఇక్కడకు వచ్చి దోసె రుచి చూశారంటే ఈ దోసెలకున్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ‘ఐస్ క్రీమ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నవదీప్, తేజస్వి కూడా ఇక్కడకు వచ్చి దోసెల రుచి చూసి ‘అదిరింది గురూ’ అన్నారు.
అజయ్ అనే ఔత్సాహికుడు ఈ దోసె ప్లేస్ ను ప్రారంభించాడు. అన్నట్లు, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ ఈ సంస్థను ఆరంభించాడు. ఇప్పుడు దోసె ప్లేస్ 200 మందికి ఉపాధిని కల్పిస్తోంది. భవిష్యత్తులో విజయవాడ, గుంటూరులకు ‘దోసె ప్లేస్’ను విస్తరించాలనుకుంటున్నట్లు అజయ్ చెప్పాడు. మరి, అజయ్ కి ఆల్ ది బెస్ట్ చెబుదామా!
More Telugu News
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి