ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి కిందట ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి, ఈ మధ్యాహ్నం జరిగే ఏపీఎన్జీవోల అభినందన సభలో బాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్జీవోలు ఆయనకు సన్మానం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశం ఉంటుంది. అనంతరం 6.30కి ఇఫ్తార్ విందులో బాబు పాల్గొంటారు.