కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు కొలువుదీరిన తర్వాత భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక చర్చలకు తొలి అడుగు పడింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. సరిహద్దు వివాదాలు, వీసాలు, టిబెటన్ శరణార్థులకు భారత్ అందిస్తున్న సాయం, ద్వైపాక్షిక వాణిజ్యం తదితర అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. వాంగ్ వి రేపు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా సమావేశం కానున్నారు.