తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ సిద్ధమైంది. ఈ సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం 7 గంటలకు గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. రాత్రి రాజీవ్ సద్భావన సమితి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ఉత్సవాలు జరుగుతాయి. రేపు గాంధీభవన్ లో నేత్రదాన, రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు.