కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అక్రమాలపై సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. జిల్లాలో రూ. 124 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీఐడీ గుర్తించింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి మూడు లక్షల జాబ్ కార్డుల ద్వారా ఈ అవినీతికి పాల్పడినట్లు సీఐడీ తేల్చింది.