జూన్ 12వ తేదీన ఎయిర్ ఏషియా తొలి విమానం వచ్చేస్తోంది. బెంగళూరు నుంచి గోవాకు మొదటి విమానాన్ని నడుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. బెంగళూరు నుంచి జూన్ 12వ తేదీ మధ్యాహ్నం ఎయిర్ ఏషియా తొలి విమానం బయల్దేరుతుందని సంస్థ సీఈవో మిట్టు చాండిల్య స్పష్టం చేశారు. ఇవాళ రాత్రి 9.30 నుంచి టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అన్నట్టు, ఎయిర్ ఏషియా టిక్కెట్లు ధర రూ. 990 (అన్ని పన్నులతో కలిపి).