ఎన్టీఆర్ పిలుపు మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యువతకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన అన్నారు. తెలంగాణా టీడీపీ నేతగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని మోత్కుపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారని, ఆరు నెలల్లో ఆయన హామీని నిలబెట్టుకోవాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.