నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12.10 గంటలకు నరేంద్ర మోడీతో నవాజ్ షరీఫ్ భేటీ కానున్నారు. ఈ సమావేశం 35 నిమిషాల సేపు ఉంటుందని సమాచారం.

భారత్ తో వివాదాల పరిష్కారానికి రేపటి చర్చలు దోహదం చేస్తాయని భావిస్తున్నట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు. అలాగే మోడీతో మాట్లాడేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం వాజ్ పేయి ప్రభుత్వానికి కొనసాగింపుగా ఉంటుందని భావిస్తున్నానని షరీఫ్ అన్నారు.