టీడీపీ అధినేత చంద్రబాబుపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని... నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా కుయుక్తులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు పాటుపడితే బాగుంటుందని సూచించారు.