అన్నీ అనుకూలించి, లెక్కలన్నీ సరిపోతే ఎన్నికల ఫలితాలు వెలువడిన వారంలోపు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ, సోమవారం నాడు నరేంద్ర మోడీ తన టీమ్ తో ప్రమాణ స్వీకారం చేసేందుకు సుముహూర్తం కావచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ అగ్రనేతలు బుధవారం నాడు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 ఫిగర్ సాధనలో ఎన్డీయే వెనుకబడిన పక్షంలో అనుసంచాల్సిన వ్యూహాల పైన ప్రధానంగా ఈ చర్చలు సాగాయి. ఈ చర్చల్లో రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.