సీమాంధ్ర ఎంపీటీసీ ఫలితాలకు సంబంధించి 3 జిల్లాల్లో వైఎస్సార్సీపీ, మిగిలిన 10 జిల్లాల్లో టీడీపీ ఆధిక్యత కనబరుస్తున్నాయి. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలలో వైకాపా ఆధిక్యత సాధించింది. మిగిలిన 10 జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. జడ్పీటీసీల విషయానికొస్తే... టీడీపీ రెండు (శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి) స్థానాలను గెలుచుకోగా, కడప జిల్లాలో వైకాపా ఒక స్థానాన్ని గెలుచుకుంది.